YSRCP : ఐదవ లిస్ట్‌లో వీళ్లకే ఛాన్స్‌ ఇవ్వనున్న సీఎం జగన్‌..

ఇప్పటికే నాలుగు సార్లు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఇవాళో రేపో ఐదవ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ లోపు అభ్యర్థుల కసరత్తును పూర్తి చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
YSRCP : ఐదవ లిస్ట్‌లో వీళ్లకే ఛాన్స్‌ ఇవ్వనున్న సీఎం జగన్‌..

YSRCP 5th List Released : అసెంబ్లీ(Assembly), లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరపడుతున్న వేళ వైసీపీ(YCP) అధిష్ఠానం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే నాలుగు లిస్టులు విడుదల చేసిన జగన్ సర్కార్(Jagan Sarkar).. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఇవాళో రేపో ఐదవ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటన చేయనున్న నేపథ్యంలో 25వ తేదీ లోపు అభ్యర్థుల కసరత్తును పూర్తి చేయాలని వైసీపీ(YCP) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఒంగోలు(Ongole) లో మాత్రం ఎంపీ సీటుపై ఇంకా పంచాయతీ తేలలేదు. ఆ స్థానంలో ఎంపీ సీటుతో పాటు బాలినేని పోటీపై ఐదో లిస్టులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశంతో పాటు.. విశాఖ, విజయనగరంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్

ఎంపీ అభ్యర్థుల లిస్ట్..

విజయనగరం - మజ్జి శ్రీనివాస్

అనకాపల్లి - అడారి రమా కుమారి

రాజమండ్రి - డాక్టర్ పద్మలత (బీసీ) కాపు అయితే వి.వి. వినాయక్

కాకినాడ - చలమలశెట్టి సునీల్

అమలాపురం - రాపాక వరప్రసాద్ లేదా ఎలీజా..

నర్సాపురం - గోకరాజు గంగరాజు తనయుడు కనకరాజు

మచిలీపట్నం - కొత్త అభ్యర్థి..

గుంటూరు - మోదుగుల వేణుగోపాల్ లేదా సినీ నటుడు అలీ..

నరసరావుపేట పేట -లావు కృష్ణదేవరాయులు, లేదా యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశం

Also Read: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా

Advertisment
తాజా కథనాలు