Madhavi Latha : మాధవీలతకు Y+ సెక్యూరిటీ హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+సెక్యూరిటీ కల్పించింది. 11 మంది ఆమెకు పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. By Jyoshna Sappogula 06 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP MP Candidate Madhavi Latha : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్(Hyderabad) బీజేపీ(BJP) అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించింది. మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత! వీఐపీ సెక్యూరిటీ(VIP Security) లో భాగంగా మాధవీలత(Madhavi Latha) కు 11 మంది పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది. #lok-sabha-elections #madhavi-latha #y-security మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి