CM Jagan : సీఎం జగన్‌కు.. దివంగత నేత వైఎస్ వివేక(YS Viveka) సతిమణి సౌభాగ్యమ్మ(Soubhagyamma) సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ' వివేక హత్యకు కారణమైన మన కుటుంబంలోని వాళ్లకు నువ్వే రక్షణగా ఉంటున్నావు. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చావు. న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, దాడులు చేస్తున్నా నీకు పట్టడం లేదా ?. సునీతకు మద్దతిచ్చిన షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నిరెత్తినట్లు ఉండటం ఏంటి ?. ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచించు ' అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.
Also Read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
ఇదిలాఉండగా.. ఏపీ రాజకీయాల్లో(AP Politics) వివేక హత్య కేసుకి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈసారి కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం సంచలనం రేపింది. మరోవైపు వైఎస్ షర్మిల కూడా కడప నుంచే పోటీ చేస్తున్నారు. దీంతో కడప పార్లమెంట్‌లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి.
Also read: 62వేల మంది వాలంటీర్లు రాజీనామా