మూడేళ్ల తర్వాత వైఎస్ షర్మిల (YS Sharmila) నేడు తన సోదరుడు ఏపీ సీఎం జగన్ ను (AP CM jagan) కలవనున్నారు. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ నివాసానికి వెళ్తున్నారు షర్మిల. అయితే.. రేపు ఆమె కాంగ్రెస్ లో (Congress) చేరడం ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ కేవలం పెళ్లి పిలుపు వరకే పరిమితం అవుతుందా? లేక వారిద్దరి మధ్య రాజకీయ ప్రస్తావన వస్తుందా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు జగన్ బ్రేక్ వేస్తారా? అన్న అంశంపై కూడా రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Andhra Pradesh Politics : వైసీపీలో సీటు దక్కని 11మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయనున్నారు?
తల్లిగా విజయమ్మ ఏం చేయబోతున్నారు? అన్న ఉత్కంఠ కూడా పొలిటికల్ సర్కిల్స్ తో పాటు వారి ఫ్యామిలీలోనూ నెలకొంది. జగన్ షర్మిలను వైసీపీలోకి ఆహ్వానిస్తారా? ఏదైనా పదవి ఆఫర్ చేస్తారా? అన్న టాక్ కూడా నడుస్తోంది. మళ్లీ అన్నాచెల్లెల్లు ఒకటి అయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం వీరి భేటీ అనంతరం ఈ అంశాలపై కొద్దిమేరకు అయినా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. నేడు కుటుంబ సమేతంగా విజయవాడకు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసంలో సోదరుడు జగన్ ను కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తారు. అనంతరం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్తారు షర్మిల. డిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమైన అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకోనునున్నారు.