Sharmila Meets Bhatti Vikramarka : తన పార్టీని కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో విలీనం చేసిన తరువాత షర్మిల మొదటి సారిగా ప్రజా భవన్ గతంలో ప్రగతి భవన్(Pragathi Bhavan) కు వెళ్లారు. ఎందుకు అని అనుకుంటున్నారా?.. ప్రస్తుతం ప్రజా భవన్ లో తెలంగాణ(Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నివాసం ఉంటున్నారు. ప్రజా భవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కను కలిసేందుకు వైఎస్ షర్మిల ప్రజా భవన్ కు వెళ్లారు.
ALSO READ: వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ
అన్న మా అబ్బాయి పెళ్ళికి రావాలి ...
'భట్టి అన్న నా కొడుకు వివాహానికి రండి' అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివాహ పత్రికను అందజేశారు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల(YS Sharmila). డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్ లో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి కుమారుడి పెండ్లీ కార్డును అంద జేశారు. ఈ నెల 18న తన తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదిన జరిగే పెండ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు.
ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000!
ప్రియాంక గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు..
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. షర్మిల ట్విట్టర్ (X) లో...'శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీ జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని మరియు శాంతిని ప్రసాదిస్తాడు మరియు మీ అద్భుతమైన చిరునవ్వు, ధైర్యం, గొప్ప శక్తి మరియు పోరాట పటిమతో మీరు అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి." అంటూ రాసుకొచ్చారు.