YS Sharmila: ఎల్లుండే ముహూర్తం ఫిక్స్..కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వచ్చేసిన క్లారిటీ!

వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

New Update
YS Sharmila: ఎల్లుండే ముహూర్తం ఫిక్స్..కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వచ్చేసిన క్లారిటీ!

తన పార్టీ విలీనంపై ముఖ్యనేతలతో షర్మిల(Sharmila) సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ ముగిసిన వెంటనే పార్టీ విలీనంపై ఓ క్లారిటీ వచ్చేసింది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఫిక్స్ అయ్యింది. ఇదే విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రేపు పార్టీ నేతలతో కలిసి డిల్లీ వెళ్ళాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విలీనం,భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీ వేదికగా రేపు(జనవరి 3) కీలక ప్రకటన చేస్తారు.

షర్మిలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో కీలక స్థానం లభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కానుండడం కాక రేపుతోంది. దీంతో తన సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నేరుగా ఎదుర్కునే అవకాశం ఉంది.

పార్టీకి ఊపిరి ఊదుతారా?
2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరం పరాజయం మూటగట్టుకుంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడం ఆ ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌కు ఏపీలో జీవమే లేకుండా పోయింది. గత 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. చాలా చోట్ల నోటాతో పోటి పడాల్సిన పరిస్థితి హస్తంపార్టీది. దీంతో షర్మిలతోనే పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా ఈ ఎత్తుగడ జరిగినట్టుగా అర్థమవుతోంది. కీలక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న సమయంలో షర్మిలా దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అటు అధికార వైఎస్సార్‌సీపీని వీడేందుకు మొగ్గుచూపుతున్న వారు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిలకు సపోర్ట్‌గా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు కూడా.

Also Read: చిరిగిన జీన్స్, స్కర్టులతో ఆలయంలోకి రావొద్దు.. కొత్త డ్రెస్ కోడ్ అమలు!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు