YS Sharmila: మోదీ క్షమాపణ చెప్పాలి.. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా?

ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ దత్తపుత్రుడు చేసిన అవినీతి మోదీకి ఇంతకాలం కనపడలేదా? అని ప్రశ్నించారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

New Update
YS Sharmila: మోదీ క్షమాపణ చెప్పాలి..  భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా?

YS Sharmila: ఎన్నికల కోసమే ప్రధాని మోడీ మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంత శ్రద్ద ఇంతకమునువు ఎప్పుడైనా పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? ఏపీ ప్రజలకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడిచారని కేంద్రంపై ధ్వజమెత్తారు.

క్షమాపణ చెప్పాలి..

ఒకపక్క టీడీపీతో పొత్తు మరోవైపు జగన్ తో అక్రమ పొత్తు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ళు మోడీ వారసుడిగా దత్తపుత్రుడిగా ప్రతీ బిల్లుకు మద్దత్తు ఇచ్చారని.. జగన్ తో మాత్రం పొత్తులేనట్లుగా విమర్శిస్తున్నారన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఈ కుటిల రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి రాజధాని లేకుండా చేసినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం, అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు ఇద్దరు మోడీ తొత్తులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:  కిరణ్ కుమార్ రెడ్డి.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే ఇలా చెయి..!

ఇనాళ్లు అవినీతి కనపడలేదా?

ఏపీకి తలమనికం విశాఖ ఉక్కు అని.. దాన్ని కూడా కాపాడలేని మోడీ ఏపీ ఏమి చేయగలరు అని ప్రశ్నించారు.  20 కోట్ల ఉద్యోగాల్లో ఏపీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? గౌరవం ఇవ్వనప్పుడు ఎందుకు బీజేపీకి మద్దతు పలకాలి? అని నిలదీశారు. పది సంవత్సరాల అధికారంలో ఉన్న మోడీకి ఇంతకాలం అవినీతి కనపడలేదా? మీరు కాపలా కుక్క కాదా? ఏపీలో జరిగిన అవినీతి పై కాగ్, సీబీఐ తో విచారణకు ఆదేశించారా? ఏపీలో హెల్త్ అడిట్ జరిగిందా? ఇంత జరుగుతుంటే ఇన్ని రోజులు గాడిదలు కాసారా? జగన్ దత్తాపుత్రుడిపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు చెయ్యడం ఏంటీ? అని ప్రశ్నించారు. అత్యంత కీలకమైన విచారణ సంస్థను ఘోరంగా అవమానిస్తే ఎందుకు చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొడ్డలితో చంపడమేనా?

విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టడానికి కారణం జగన్ అని.. విశాఖ స్టీల్ ఏ పరిస్థితిలో ఉందో జగన్ కు తెలియదా? భూములపై ఉన్న శ్రద్ద మనుషులపై లేదా? అని మండిపడ్డారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు ఊళ్లు పంచుకోవడానికి చూస్తున్నారని ఫైర్ అయ్యారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో సాధించిదేంటి? 42ప్రాజెక్ట్ ల్లో జగన్ ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు