నేడు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్ధాంజలి ఘటించి కన్నీంటిపర్యంతమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు.
ఇక జగన్, షర్మిల మధ్య విభేదాలు మరోసారి బయటకువచ్చాయి. తండ్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే వేరు వేరుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ వీరిద్దరూ వేర్వేరుగానే నివాళులర్పించారు. ఈసారి కలుస్తారేమోనని వైఎస్ అభిమానులు ఎంతో ఆశతో చూశారు. కానీ నిన్న సాయంత్రం షర్మిల ఒక్కరే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఉదయం తండ్రికి నివాళులర్పించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. షర్మిల వెళ్లిన అనంతరం ఇడుపులపాయకు జగన్ వచ్చేందు ప్లాన్ రెడీ చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.