Sharmila: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్!

పార్టీ ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు షర్మిలా అత్యవసరంగా సమావేశంకానున్నారు. కాంగ్రస్‌లో YSRTP విలీనం,భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆ తర్వాత షర్మిల కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

New Update
Sharmila: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్!

YSRTP అధినేత్రి వైఎస్‌ షర్మిల(YS SHARMILA) కాంగ్రెస్‌(Congress)లో తన పార్టీ విలీనానికి ముహుర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ నిమిషంలోనైనా ఈ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు షర్మిలా అత్యవసరంగా సమావేశంకానున్నారు. పార్టీ విలీనం,భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

ఇవాళే అనౌన్స్ చేస్తారా?
పార్టీ విలీనంపై షర్మిల ఇవాళే(జనవరి 2) కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యనేతలతో సమావేశం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు బయలు దేరనున్నారు షర్మిల. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం YSR ఘాట్ వద్ద ఉంచి మహానేతకు నివాళులు అర్పించన్నారు.

ఎల్లుండు ఫిక్స్‌?
తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు రెండ్రోజుల ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఓట్లు చీలకుండా ఇలా చేశానని చెప్పుకొచ్చారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. షర్మిల జనవరి 4 నాటికి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అటు ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నెలకొంది. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఇన్నాళ్లూ చడీచప్పుడు లేకుండా ఉన్న నేతలు ప్రస్తుతం తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఆమెను రాకను స్వాగతిస్తున్నామని ఆహ్వానం పలికారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆమె రాకతో కాంగ్రెస్‌ పార్టీకి కచ్చితంగా 10 నుంచి 15 శాతం ఓట్లు పెరిగే అవకాశముంది. అలాగే రెండు మూడు స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే వైసీపీపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు, టికెట్‌ దక్కని వారు, గతంలో కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు షర్మిల ద్వారా కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీటన్నింటిని ఎలా సమన్వయం చేసుకుని మరింత బలపడేందుకు ప్రయత్నిస్తారా అన్నది చూడాల్సి వుంది.

ALSO READ: జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!!

Advertisment
తాజా కథనాలు