/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sharmila-jagan-vijayamma-jpg.webp)
ఏపీ సీఎం వైయస్ జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ రిసార్ట్స్ లో తన మేనల్లుడు, సోదరి షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
కొంత కాలంగా జగన్‌కు, షర్మిలకు మధ్య అంతా సవ్యంగా లేదన్న ప్రచారం జరుగుతోంది.
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిల వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిపై యుద్ధమే చేయనున్నారు. అయినా రాజకీయాలు రాజకీయాలే.. ఫ్యామిలీ ఫ్యామిలీనే!
నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు జగన్ తన సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు. దంపతులతో పాటు వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమాన్ని టీవీ, సోషల్ మీడియాలో చూసిన వారంతా నిశ్చితార్థ వేడుకలో జగన్ అంతా హ్యాపీగా లేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయన భార్య భారతి మాత్రం చాలా ఉల్లాసంగా కనిపించారు.
హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్ సందడి చేశారు. షర్మిల-విజయమ్మతో కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Also Read: సీటుకోసం సిగపాట్లు.. చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మిలు