YS Sharmila: ఏపీసీసీ చీఫ్‌గా (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ కాంగ్రెస్‌లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షర్మిల దూకుడు పెంచుతోంది. జిల్లా పర్యటనలు చేస్తూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది వైఎస్ షర్మిల. ఇవాల్టి నుంచే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
Also Read: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ..!
సభ్యత్వం కంపల్సరీ..
విజయవాడ పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ సెకండ్ అప్లికేషన్ పెట్టారు. బద్వేల్ నుంచి కమలమ్మ మూడవ అప్లికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకునే వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కచ్చితంగా ఉండాలని అంటున్నారు. పూర్తి అర్హతలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను నిర్ణయిస్తారని తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!
మాజీలకే పెద్దపీట
అయితే, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మాజీలంతా సొంతగూటికి రావాలని షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు మాజీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెపుతున్నాయి. జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిలను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నట్టు సమాచారం.