YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే!

నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. ఒంటరిగానే ఎన్నికలు వెళ్లాలని, అవసరమైతేనే కమ్యూనిస్టులతో కలవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు షర్మిల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

New Update
YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే!

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికకు ముహూర్తం ఖరారైంది. నేడు  ఉదయం 10.30 గంటలకు సోనియాతో షర్మిల (YS Sharmila) భేటీ కానున్నారు. ఆ తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరనున్నారు. అనంతరం ఇవాళ ఉదయం జరగనున్న ఏఐసీసీ (AICC) కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతగా షర్మిల పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు కూడా షర్మిల సిద్ధమైనట్లు సమాచారం. అయితే.. ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: BREAKING: జగన్ తో ముగిసిన షర్మిల భేటీ..!

ఆ షరతులకు అధిష్టానం సిద్ధమైతేనే ఏపీ బాధ్యతలు చేపడతానంటూ తేల్చి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలన్నది షర్మిల ఫస్ట్ డిమాండ్ గా తెలుస్తోంది. వసరమైతేనే లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని సూచించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీతో వెళ్లాలి? అనేది నిర్ణయించాలని అధిష్టానానికి షర్మిల తెలిపినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పడంతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఓకే చెప్పినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు