Sharmila: నా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం.. అందుకే నాకు ఆ కీలక స్థానం: షర్మిల సంచలన ప్రకటన తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే ఖాయమని తేల్చి చెప్పారు. రేపు డిల్లీ వెళ్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. By V.J Reddy 02 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి YS Sharmila Joins Congress : కాంగ్రెస్ పార్టీలో చేరడంపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పోటీ తాము పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం అని అన్నారు. కాంగ్రెస్(Congress) పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించాం అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది.. కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP చాలా పెద్ద పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ALSO READ: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారని అన్నారు. దీనికి కారణం YSR తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమే అని తెలిపారు. YSRTP ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేదని అన్నారు. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందని పేర్కొన్నారు. మా త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారు కాంగ్రెస్ ముఖ్య నేతలు అని అన్నారు. కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని.. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. అందుకే కాంగ్రెస్ పార్టీని భలపరచాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీ(Delhi) కి వెళ్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు వచ్చినట్లు తెలిపారు. ALSO READ: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు #ys-sharmila #breaking-news #telangana-latest-news #ap-latest-news #sharmila-joins-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి