AP : ఏపీ ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ (YS Jagan)సోమవారం వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు ఆయన నేడు శ్రీకారం చుట్టునున్నారు. సోమవారం తాడేపల్లి నుంచి 11 గంటలకు బయల్దేరి పులివెందులకు చేరుకుంటారు.
ముందు వైఎస్సాఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆయన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభిస్తారు. ఆ తరువాత వైఎస్సాఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ ని ప్రారంభిస్తారు.
అక్కడ నుంచి బయల్దేరి వైఎస్సార్ జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించి తరువాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రారంభిస్తారు. ఇక్కడ పలు కార్యక్రమాలను ప్రారంభించిన తరువాత ఇడుపుల పాయకు బయల్దేరి వెళ్తారు.
వైఎస్సాఆర్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు . ఆ తరువాత గెస్ట్ హోస్ కు వెళ్లి అక్కడ నుంచి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.
కాగా ఆదివారం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో ప్రసంగించారు. మరో ఐదేళ్లు తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని కామెంట్స్ చేశారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ సిద్ధం అయ్యాయని, ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం అయిందన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివని, ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ అభివర్ణించారు.చంద్రబాబు మాదిరిగా తనకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరన్నారు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవని.. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడని పేర్కొన్నారు.
నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో.. తనకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లేనని కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కౌంటర్లు వేశారు.
Also read: విశ్వంభర సెట్స్ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్!