CM Jagan: జగన్ కు మద్దతుగా విజయమ్మ..కొడుకుని హత్తుకుని భావోద్వేగం సీఎం జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. అయితే, ఇనాళ్లు కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపించడంతో విజయమ్మ మద్దుతు జగన్ కేనని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Vijayamma At YSR Ghat: ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' (Memantha Siddham) అనే పేరుతో జిల్లాల వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా సీఎం జగన్ (CM Jagan) తన తల్లి వైఎస్ విజయమ్మ తోపాటు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. Also Read: ఏలూరులో కూటమి నేతల మధ్య టికెట్ రగడ ఇదిలా ఉండగా.. ఒకవైపు కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ అన్న జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతోంది. మరోవైపు కొడుకు జగన్ వైసీపీ అధినేతగా ఉంటున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటంతో వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతుగా నిలబడుతారోనన్నా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇనాళ్లు కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపించడంతో విజయమ్మ మద్దుతు జగన్ కేనని వార్తలు వినిపిస్తున్నాయి. #ap-cm-jagan #ys-vijayamma #ysr-ghat #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి