YS Jagan: అవినీతి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: జగన్

స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ పేర్కొన్నారు.

YS Jagan: అవినీతి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: జగన్
New Update

YS Jagan Comments on Chandrababu Arrest: స్కిల్ డెవలెప్మెంట్ కేసు (Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని.. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడిందని ఆరోపించారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు రిమాండ్‌కు పంపించిందన్నారు.

స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో ఐటీ అధికారులు పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని పేర్కొన్నారు. గతంలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు. ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ సర్టిఫికేట్‌ ఇచ్చినా.. కొందరు బాబు చేసింది నేరమే కాదని వాదించేందుకు సిద్ధమయ్యారన్నారు. అలాగే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పైనా జగన్ తీవ్ర విమర్శలు చేశారు.ములాఖత్ కు వెళ్లి మిలాఖత్ తీసుకున్నారంటూ సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్.

చంద్రబాబు అరెస్టయినా.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు మాత్రం ప్రశ్నించరంటూ పవన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అయితే చట్టం ఎవరికైనా ఒక్కటేనని స్పష్టంచేశారు.  గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని.. అవినీతిపై ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

#pawan-kalyan #chandrababu-arrest #skill-development-case #ys-jagan-comments-on-chandrababu-arrest #ys-jagan-comments-on-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe