Youtube: అలా చేయడం అశ్లీల దృశ్యాలు అమ్మడమే.. యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు..

యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు.. తల్లులు, కుమారులకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు అప్‌లోడ్ చేస్తుండటంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆ సంస్థ ప్రతినిధి హాజరుకావాలని లేకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Youtube: అలా చేయడం అశ్లీల దృశ్యాలు అమ్మడమే.. యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు..
New Update

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూ్బ్‌లను వాడకుండా ఎవరూ ఒక్కరోజు కూడా ఉండలేరు. ఇక యూట్యూబ్‌లో ప్రతిరోజూ లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని ఉపయోపడే వీడియోలు ఉంటే మరికొన్ని అనవసరమైనవి అసభ్యకరమైన వీడియోలు కూడా అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు.. తల్లులు, కుమారులకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు అప్‌లోడ్ చేస్తుండటంతో దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది.

Also Read: హైదరాబాద్‌లో తొలి మానవ రహిత విమానం ఆవిష్కరణ

చిన్నారుల భద్రతకు హాని

ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆయా ఛానళ్లకు చెందిన జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ వద్దకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇండియాలోని యూట్యూబ్‌ పబ్లిక్ పాలసీ హెడ్‌ మీరా ఛాట్‌కు కమిషన్ లేఖను పంపింది. ఇలాంటి వీడియోలు చిన్నపిల్లల భద్రతకు వారి శ్రేయస్సుకు హాని కలిగించే ప్రమాదం ఉందని.. అలాగే ఈ వీడియోలను మైనర్లు సైతం చూసేందుకు అనుమతి ఉండటంతో ఇది మరింత ఆందోళనకరమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లేఖలో తెలిపింది.

అసభ్యకర కంటెంట్‌ను తొలగించేందుకు ఎలాంటి మెకానిజం ఉపయోగిస్తున్నారో చెప్పాలని కమిషన్ యూట్యూబ్‌ను ఆదేశించింది. ఒకవేళ తాము పంపిన సమన్లకు స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ అంశంపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చీఫ్ ప్రియాంక్‌ కనూంగో స్పందించారు. తల్లులు, యుక్తవయసు కుమారుల మధ్య అసభ్యకరంగా ఉన్నటువంటి సన్నివేశాలను కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు విడుదల చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

అశ్లీల దృశ్యాలు అమ్మడం లాంటిదే

ఇలాంటి వీడియోలు పోక్స్‌ చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని.. ఇలాంటి వీడియోలతో బిజినెస్ చేయడం అనేది అశ్లీల దృశ్యాలను అమ్మడం లాంటిదేనంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిపై యూట్యూబ్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ దారుణాలకు పాల్పడేవారిని జైలుకు పంపించాలంటూ మండిపడ్డారు.

#telugu-news #national-news #youtubeindia
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe