Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు! కర్నూల్ జిల్లా బిజినపల్లి పరిధిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు. By srinivas 14 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Rape Case : అమ్మనాన్న తర్వాత కంటికి రెప్పల కాపాడాల్సిన సొంత చెల్లినే ఓ కామాంధుడు గర్భవతిని చేశాడు. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని చిన్న బాలికపట్ల పశువులా ప్రవర్తించాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకుని లైంగిక దాడి (Sexually Assaulted) కి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడగా ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. ఈ దారుణమైన సంఘటన కర్నూల్ జిల్లా (Kurnool District) బిజినపల్లి మండలం కీమ్యాతాండలో జరిగింది. 15 రోజులుగా అటవీ ప్రాంతంలో.. ఈ మేరకు ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళా కొంతకాలంగా కీమ్యాతాండలో నివాసం ఉంటోంది. అయితే 13 ఏళ్ల వయసున్న తన చెల్లిని ఇంటినుంచి తీసుకుని వెళ్లిన యువకుడు.. అమ్మాయితో కలిసి వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దరం అటవీ ప్రాంతం (Forest Area) లో 15 రోజులు తిరిగాడు. ఈ క్రమంలోనే ఖిల్లాఘనపుర్ మీదుగా నడుచుకుంటూ వెళ్తుంటే స్థానికులు గుర్తించి వనపర్తి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే తల్లికి సమాచారం అందించి, బాలికకలు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read : దంచికొడుతున్న వాన.. రేపు, ఎల్లుండి కూడా.. #kurnool #sexually-assaulted #sister #brother మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి