Love Tips : మీది వన్‌సైడ్‌ లవ్వా..? అయితే చేయాల్సిందిదే!

వన్‌సైడ్‌ లవ్‌ అన్నది కొన్ని సినిమాలో చూపించినట్టు మంచిదేమీ కాదు. ఏకపక్ష సంబంధంలో జీవించే వ్యక్తి తన సమయాన్ని ఉద్దేశపూర్వకంగా వృధా చేసుకుంటాడు. నిజాన్ని అంగీకరించి ముందుకు వెళ్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి!

New Update
Love Tips : మీది వన్‌సైడ్‌ లవ్వా..? అయితే చేయాల్సిందిదే!

One Side Love : లవ్(Love) గురించి ఎన్నో సినిమాల్లో వినే ఉంటారు. ఓ మనిషి ఎంతో హార్ట్‌ఫుల్‌గా లవ్ చేయడం అనేది ఓ అదృష్టం. అయితే కొందదూ ఆ లవ్ చెప్పరు. వన్ సైడ్ లవ్(One Side Love) చేయడం అనేది సినిమా(Cinema) లో, సీరియల్స్‌(Serials) లో చూస్తేనే ఉంటాం. కానీ అది నిజ జీవితంలో వచ్చే వరకు బాధను మాత్రమే ఇస్తుంది. మనం ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే వారు తిరిగి మనల్ని ప్రేమించకపోతే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏకపక్ష సంబంధంలో జీవించే వ్యక్తి తన సమయాన్ని ఉద్దేశపూర్వకంగా వృధా చేసుకుంటాడు. అతనికి అవతలి వ్యక్తి నుంచి సానుకూల స్పందన రానప్పుడు.. వారు కోపంతో ఏదో ఒక చర్య తీసుకుంటారు. అది ఇద్దరికీ హాని కలిగిస్తుంది, మానసికంగా కలవరపడుతుంది. ఈ పరిస్థితి రాకముందే ముందుకు వెళ్లడం గురించి ఆలోచించడం మంచిది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గత జ్ఙాపకాల జోలికి వెళ్లకండి:

  • మీకు ఎవరితోనైనా మానసికంగా కనెక్ట్ అయినప్పుడు.. ఆ వ్యక్తిని,  జ్ఞాపకాలను, భావాలను వదిలేయాలి.  ఆ జ్ఞాపకాలలో చిక్కుకుని జీవించడం మరింత బాధాకరం చేసుకోవద్దు. ఇలా చేయడం కష్టంగా ఉంటే మీ స్నేహితుడు, పెద్దలు, సన్నిహితులు,  కౌన్సెలర్ వంటివి తీసుకోచ్చు.

మీ ఆశయంపై దృష్టి:

  • పాత సంబంధం నుంచి బయటకు రావాలంటే వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఇలా ఇస్తే మీ దృష్టిని మళ్లుతుంది. అంతేకాదు ఇష్టమైన పనులు, కొత్త విషయాలను నేర్చుకోవటం వంటి చేస్తూ ముందుకు వెళ్లాలి. ఇలా మిమ్మల్ని మీరు బిజీ ఉండటం, మీ అభిరుచులకు సమయం ఇవ్వడం వంటివి చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నిజాలను ఒప్పుకోండి:

  • ముందు ప్రేమించిన వ్యక్తిపై ఊహల నుంచి బయట పడాలి. అవతలి వ్యక్తిపై ప్రేమను,  త్యాగాలని వదిలేయండి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే లైఫ్‌ సంతోషంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఆకుకూరల రసం శీతాకాలంలో చర్మానికి ఒక వరం.. ఎందుకో తెలుసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు