Money Tips : మీ నెల జీతం రూ. 30వేలు అయితే...ఈ మూడు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవల్సిందే..!!

మనం సంపాదించేది తక్కువగా ఉన్నా ఇంటిని నడిపించవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రూ. 30వేలు అయితే ప్రతినెలా రూ. 100 అయినా పక్కనపెట్టండి. నెలవారీ ఈఎంఐల జోలికి వెళ్లకండి.ఇలా చేస్తే భవిష్యత్తుకోసం డబ్బు ఆదా చేసుకోవచ్చు.

New Update
Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

నేటికాలంలో ఒకరు సంపాదిస్తే బతకలేని పరిస్థితి. పెరుగుతున్న ఖర్చులతో కుటుంబాన్ని నెగ్గుకురావడం చాలా కష్టం. కుటుంబంలో సంపాదించేది ఒకరే అయితే..తమ ఆర్థిక నిర్వహణను ఎలా ముందుకు సాగించాలి? ఏం చేయడం ద్వారా తక్కువ జీతం ఉన్నప్పటికీ ఇంటి ఖర్చులతో పాటు..భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయవచ్చు. మీ ఆదాయం నెలకు రూ. 30వేలు అయితే మీరు ఆ పనిని ఈజీగా ఎలా చేస్తారు. మీరు కొంచెం తెలివిని ఉపయోగిస్తే..ఈ జీతంతో కూడా ఇంటిని నిర్వహించవచ్చు. దీని ద్వారా మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అయితే మీరు అదనపు ఖర్చులను కూడా తగ్గించుకోవాలని గుర్తుంచుకోండి. ఇంటి మొత్తాన్ని సాఫీగా నడిపే వారు ఈ పని ఎలా చేయాలో నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా తెలుసుకుందాం.

ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి:

మొదటి బాధ్యత :
మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది రుణాదాతలు లేదా బ్యాంకులు రూ. 30వేల జీతం వచ్చేవారికి లోన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. కానీ మీరు తీసుకునే ఏ లోన్ అయినా సరే ఖరీదైనదిగా ఉండకూడదు. లేదంటే వీలైనంత వరకు రుణాలకు దూరంగా ఉండటం మంచిది.

రెండవ బాధ్యత:
ప్రతినెలా కొంత డబ్బును పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనికోసం పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. అది రూ. 100అయినా సరే. ప్రతినెలా ఆ మొత్తాన్ని పక్కనపెట్టండి. నగదురూపంలో ఇంట్లో ఉంచుకోకూడదు. దానికి బదులుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ భద్రపరుచుకోండి. ఇది చిన్న ఫండ్ ను క్రియేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇదే కాకుండా అదనపు డబ్బు మొత్తాన్ని చిన్న బాక్సులో పెట్టి..ప్రతినెలా అకౌంట్లో లో జమ చేయండి..ఇలా చేస్తే మీ పొదుపును పెంచుతుంది.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఈ విషయలు తప్పకుండా గుర్తుంచుకోండి..!!

మూడవ బాధ్యత:
మీకు వస్తున్న జీతం ఆధారంగా...మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి. చాలా ఖర్చులను తగ్గించుకున్నట్లయితే..మీ బడ్జెట్ ను మీరు సమర్ధవంతంగా నిర్వహించవచ్చు. లేదంటే చిన్న నెలవారీ ఈఎంఐల దగ్గర ఖరీదైన వాటిని కొనుగోళ్లు చేయడానికి పండుగ, ఆఫ్ సీజన్స్ లో మంచి డిస్కౌంట్స్,నో కాస్ట్ ఈఎంఐ డీల్స్ ను పొందడంలో కూడా ముందస్తు ప్లాన్ మీకు చాలా సహాయపడుతుంది.

చివరి బాధ్యత:
మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా ఫ్రీగా లేదా తక్కువ ఖర్చుతో స్కిల్స్ ను నేర్చుకునేందుకు అనుమతించే ప్రభుత్వ కార్యక్రమాల కోసం సెర్చ్ చేయండి. దీంతో మీ సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు