Health Tips: రాత్రిపూట కాళ్లలో తిమ్మిరి వస్తోందా?..ఇదే కారణం కావొచ్చు

రాత్రి సమయంలో కాళ్లలో తిమ్మిర్లు రావడం సాధారణ విషయమే అని నిపుణులు అంటున్నారు. లెగ్ క్రాంప్స్ సమస్య సాధారణంగా విటమిన్ బి12 లోపం వల్ల వస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల తిమ్మిర్లు వస్తాయని అంటున్నారు. విటమిన్ B12 ఉన్న ఆహారం తినాలి.

New Update
Health Tips: రాత్రిపూట కాళ్లలో తిమ్మిరి వస్తోందా?..ఇదే కారణం కావొచ్చు

Health Tips: చాలా మందికి రాత్రిపూట లేదా అర్ధరాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాళ్లు తిమ్మిర్లు వస్తాయి. కాసేపటి తర్వాత మళ్లీ మామూలు స్థాయికి చేరుకుంటారు. కొన్నిసార్లు నొప్పి మాత్రం విఫరీతంగా పెరుగుతుంది. రాత్రి సమయంలో కాళ్లలో తిమ్మిర్లు రావడం సాధారణ విషయమే అని నిపుణులు అంటున్నారు. దాదాపు మూడింట ఒక వంతు మందికి ఈ సమస్య ఉండదంటున్నారు. లెగ్ క్రాంప్స్ సమస్య సాధారణంగా విటమిన్ బి12 లోపం వల్ల వస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల తిమ్మిర్లు వస్తాయని అంటున్నారు. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుందో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

విటమిన్ B12 ఎందుకు అవసరం?:

  • విటమిన్ B12 శరీరంలో చాలా ముఖ్యమైనది. విటమిన్ B12 ఒక కరిగే పదార్థం. ఇది మీ శరీరంలోని ఇతర భాగాలను పోషించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ విటమిన్‌ లోపం ఉంటే శరీరం దిగువ భాగంలో తిమ్మిరి లేదా నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉంటుంది. అందుకే ఆహారంలో విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.

విటమిన్ B12 ఉన్న ఆహారాలు:

  • శరీరంలో విటమిన్ బి12 పెరగడానికి మాంసాహారం తీసుకోవచ్చు. విటమిన్ B12 ముఖ్యంగా చేపలు, పౌల్ట్రీ, గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. మరోవైపు శాఖాహారులకు అయితే ఆకు కూరలు, పిస్తా, బాదం, డ్రై ఫ్రూట్స్‌తో పాటు జున్ను, పాలు, మజ్జిగలో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది.

తగినంత నీరు తాగాలి:

  • విటమిన్ బి 12 కోసం ఒక వ్యక్తి రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు. సమతుల్య ఆహారం, సరైన మొత్తంలో నీరు తీసుకుంటే కొన్ని రోజుల్లో తిమ్మిరి సమస్య నుంచి బయటపడవచ్చు. పెద్దలు రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 తీసుకోవాలి. విటమిన్‌ బి12లోపంతో శరీరం క్రమంగా బలహీనపడుతుంది. రుచి, వాసన కోల్పోవడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మీ జుట్టు రాలుతోందా?..ఈ పువ్వు తింటే ఇక నో ప్రాబ్లమ్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు