Bahadurpura: పాతబస్తీలో అర్థరాత్రి కత్తులతో వీరంగం.. యువకుడి దారుణ హత్య హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒవైసీ మార్కెట్ సమీపంలోని అసద్‌బాబానగర్‌లో 20 ఏళ్ల ఖలీల్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ ఘటన పాతబస్తీలో కలకలం రేపుతోంది. By Vijaya Nimma 16 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒవైసీ మార్కెట్ సమీపంలోని అసద్‌బాబానగర్‌లో 20 ఏళ్ల ఖలీల్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. యువకుడిని కత్తులతో వేటాడి వెంటాడి చంపారు. అడ్డువచ్చిన యువకుడి తండ్రిని కూడా బెదిరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బహుదూర్‌పురా పోలీసులు.. రక్తపు మడుగులో పడిఉన్న ఖలీల్‌ను ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఖలీల్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖలీల్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: పాలతో చేసే స్వీట్ ఇష్టం లేదా.. కొబ్బరితో ట్రై చేయండి #hyderabad #murder #bahadurpura మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి