PM Modi: ప్రధాని మోదీకి నిరసన సెగ.. కరెంట్ పోల్ ఎక్కిన యువతి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ ఎదురైంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ సభలో ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది యువతి. ఇది గమనించిన ప్రధాని.. యువతిని కిందకు దిగాలని వేడుకున్నారు. By Shiva.K 11 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Young Girl Protest Against PM Modi: సికింద్రాబాద్‌లో మాదిగల విశ్వరూప మహాసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి నిరసన సెగ ఎదురైంది. ఎస్సీ వర్గీకరణ చేయ వద్దంటూ కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపింది ఓ యువతి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే వర్గీకరణకు వ్యతిరేకంగా యువతి తన నిరసన గళం వినిపించింది. దేశంలో మోదీ పాలన వచ్చాక కుల, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది యువతి. దేశంలో రోజుకో హత్యాచారం జురుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది యువతి. జరుగుతున్న అన్యాయాలపై చర్యలు లేవు గానీ.. కుల, మతాలను అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది యువతి. ఒకే మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ప్రధాని మోదీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది యువతి. అయితే, యువతి నిరసన వ్యక్తం చేయడాన్ని గమనించిన ప్రధాని మోదీ.. కరెంట్ పోల్ దిగాలంటే వేడుకున్నారు. Also Read: కన్నీరుమున్నీరైన మందకృష్ణ మాదిగ.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ.. కరీంనగర్‌లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ? #telangana-news #hyderabad #secundrabad #pm-narendra-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి