Summer Skin Care: సమ్మర్‌లో మీ చర్మం చక్కగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!!

వేసవికాలంలో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చిట్కాలతోపాటు, సమ్మర్ స్కిన్ కేర్ క్రీములు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు అంటున్నారు. చర్మాన్ని చికాకు, పొడిబారకుండా రక్షించడానికి మృదువైన, శుభ్రమైన కాటన్ టవల్ ముఖ్యం.

New Update
Summer Skin Care: సమ్మర్‌లో మీ చర్మం చక్కగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!!

Summer Skin Care: వేసవి కాలం వచ్చింది. ఇప్పుడు చర్మాన్ని సంరక్షించడం అంటే కేవలం మాయిశ్చరైజర్ అప్లై చేయడం మాత్రమే కాదు. ముఖ్యంగా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.ఈ కాలంలో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చిట్కాలతోపాటు, సమ్మర్ స్కిన్ కేర్ క్రీములు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే డ్రైనెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే..మాయిశ్చరైజర్‌ను మాత్రమే పూయడం సరిపోదు. అధిక సూర్యకాంతి శరీరాన్ని డీహైడ్రేట్ చేసి పొడి చర్మాన్ని పెంచుతుంది. ముఖ్యంగా చర్మంపై చాలా కఠినమైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంపై కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

publive-image

వేసవిలో చర్మ సంరక్షణ కోసం:

  • క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌ వాడటం వలన చర్మం తగిన క్లెన్సర్‌తో శుభ్రం చేస్తుంది. తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం వంటివి ఉంటాయి.
  • స్టోర్‌లో అలోవెరా జెల్‌ కంటే ఇంట్లో తయారు చేసిన అలోవెరా జెల్‌ మంచిది. సూర్యరశ్మి వల్ల ఏర్పడిన నల్ల మచ్చలను తొలగించడానికి, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి బాగా పనిచేస్తుంది.
  • ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, క్యారెట్, విటమిన్ సి,ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఉంటే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తుంది.
  • ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగిలి. కెఫిన్, ఆల్కహాల్ తీసుకుంటే శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.
  • చర్మాన్ని శుభ్రపరచడానికి ప్రతిరోజూ గ్లిజరిన్ ఉపయోగించాలి. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేసి రోజంతా తేమగా ఉంచుతుంది.
  • తలస్నానానికి ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేస్తే ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.

publive-image

మృదువైన టవల్ ముఖ్యం:

  • చర్మాన్ని చికాకు, పొడిబారకుండా రక్షించడానికి మృదువైన, శుభ్రమైన కాటన్ టవల్ ముఖ్యం. అంతేకాకుండా సువాసనగల సబ్బులను వాడితే.. చర్మాన్ని చికాకుపెట్టడంతోపాటు పొడిగా మారుతుంది. దానికి బదులుగా..సహజ సబ్బు, షవర్‌జెల్ వాడటం ఉత్తమం. హానికరమైన UV కిరణాల నుంచి  రక్షించుకోవడానికి, చర్మం పొడిబారకుండా ఉండడానికి.. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బ్రష్ చేయడానికి బెస్ట్ విధానం ఇదే..లేకపోతేం మీ దంతాలకు ఎఫెక్ట్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు