Health Tips: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆవిరిని 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి. అతిగా ఆవిరిపడితే ముక్కు లోపల ఉండే చిన్న వెంట్రుకలు కాలిపోయి.. అనేక శ్వాసకోశ సమస్యలతోపాటు కళ్లు పొడిబారటం, కంటివాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి
New Update

Health Tips: జలుబు, కఫం ఉన్నప్పుడు ఆవిరి పట్టడం సాధారణం. అయితే ఆవిరిని తప్పుగా పడితే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. జలుబు చేసి ముక్కు మూసుకుపోయినట్లయితే ఆవిరి పడితే ఆ సమస్య తగ్గుతుంది. ఎగువ కఫం , ఇతర ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బ్యూటీ కేర్‌లో భాగంగా స్టీమ్‌ వాడేవారు ఉన్నారు. ముఖంపై మొటిమలు కూడా ఆవిరి పట్టడం వల్ల తగ్గుతాయి. అయితే ఆవిరి పట్టినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఎక్కువ సమయం:

  • 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అతిగా ఆవిరిపడితే ముక్కు లోపల ఉండే చిన్న వెంట్రుకలు కాలిపోతాయని చెబుతున్నారు. ఈ వెంట్రుకలు బయటి నుంచి దుమ్ము, ఇతర అలెర్జీ కారకాలను అడ్డుకుంటాయి. ఈ వెంట్రుకలు కాలిపోవడం వల్ల అనేక శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కంటికి మంచిది కాదు:

  • ఎక్కువ సేపు ఆవిరి పట్టడం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. దీని వల్ల కంటి వాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం జరుగుతుంది. కళ్లకు ఆవిరి తగలకుండా ఉండేందుకు ఐ ప్యాడ్స్ వాడుకోవాలి. బ్యూటీ పార్లర్లలో ఆవిరి పట్టేటప్పుడు కళ్లపై కాటన్ ప్యాడ్లు వేయడానికి కారణం ఇదే.

విక్స్‌తో ఆవిరి పట్టొద్దు:

  • చాలా మంది దుకాణంలో కొనుగోలు చేసిన విక్స్, అమృతాంజన్‌లను నీటిలో ఆవిరి పడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. తులసిని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

స్టీమర్:

  • చాలా మంది ఆవిరి పట్టేందుకు స్టీమర్‌ వాడుతారు. వీటిలో వేడి ఆవిరిని నియంత్రించడం చాలా కష్టం. వీటి వల్ల కాలిన గాయాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కళ్లు, చర్మానికి ఎంతో హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆవిరి పట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇలాంటి బాదం పప్పులు అస్సలు కొనకండి.. విషపూరితం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #hold-steam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe