Old Sarees: పాత చీరలను మూలన పడేస్తున్నారా ?.. ఇలా మళ్లీ వాడుకోవచ్చు పాత చీరలను కొత్త మార్గాల్లో స్టైల్‌గా మార్చవచ్చు. పాత చీరలు ఉంటే వాటితో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. అనార్కలి డ్రెస్, సల్వార్, స్ట్రెయిట్ కుర్తా, కాంచీపురం, సిల్క్ లేదా బనారస్ చీరతో కుట్టించుకున్న డ్రెస్సులు ఏ సందర్భంలో అయినా వేసుకోవచ్చు. By Vijaya Nimma 04 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Old Sarees: బట్టల విషయంలో మహిళలు రాజీపడరు. ఎన్ని చీరలు కొన్నా తమకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొని పెట్టుకుంటారు. నెలకు రెండు మూడు చీరలు కొనేవారూ ఉన్నారు. ఇలా ప్రతి భారతీయ మహిళ వార్డ్ రోబ్ నిండా చీరలు ఉంటాయి. వీటిలో కొన్ని చీరలను రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. మరికొన్ని కొన్ని పండుగలు, వేడుకలు ఉన్నప్పుడే ధరిస్తారు. కాస్త పాతపడగానే చీరలను మూలకు పడేస్తుంటారు. అయితే ఇలాంటి చీరలు మీ దగ్గర ఉంటే వాటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు ఎలాగో తెలుసా. అవును పాత చీరలను కొత్త మార్గాల్లో స్టైల్‌గా మార్చవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. డ్రస్సులు: మీ దగ్గర చాలా పాత చీరలు ఉంటే వాటితో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. అనార్కలి డ్రెస్, సల్వార్, స్ట్రెయిట్ కుర్తా కుట్టించుకోవచ్చు. కాంచీపురం, సిల్క్ లేదా బనారస్ చీరతో కుట్టించుకున్న డ్రెస్సులు ఏ సందర్భంలో అయినా వేసుకోవచ్చు. అంతేకాకుండా క్లాసీ లుక్‌లో కనిపిస్తాయి. దుపట్టా: దుపట్టా తయారు చేయడానికి షిఫాన్ లేదా జార్జెట్ చీరలను ఉపయోగించవచ్చు. ఇది సాదా సల్వార్ లేదా ప్రింటెడ్ సల్వార్ కోసం అందమైన దుపట్టాగా ఉపయోగించవచ్చు. కుషన్ కవర్: కుషన్ కవర్‌లకు అందమైన బనారసీ చీరలు బాగా సరిపోతాయి. ఈ చీర బార్డర్ కట్ చేసి వేరే దేనికైనా వాడుకోవచ్చు. మిగిలిపోయిన చీరలను కండువాలు మరియు గుడ్డ సంచులుగా తయారు చేయవచ్చు. బనారసీ చీర కుషన్ కవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫ్లేర్డ్ స్కర్ట్: మీ దగ్గర చందేరీ సిల్క్ లేదా బ్రోకేడ్ చీర ఉంటే దానితో ఫ్లేర్డ్ స్కర్ట్‌ని స్టైల్‌గా కుట్టించుకోవచ్చు. ఇది మీకు ఇండో-వెస్ట్రన్ లుక్ ఇస్తుంది. మీరు ఫార్మల్ షర్ట్ లేదా సాధారణ టాప్‌గా కుట్టించుకోవచ్చు. ట్యూనిక్, టాప్: పొడవాటి చీర అంటే 6 మీటర్ల చీరతో ట్యూనిక్ లేదా టాప్ చాలా సులభంగా కుట్టించుకోవచ్చు. దీన్ని జీన్స్ లేదా లెగ్గింగ్స్‌తో వేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి #tips #old-sarees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి