Kidney Stones: మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు ఎంతో ముఖ్యం. ఈ ప్రస్తుత కాలంలో కిడ్నీ (Kidney ) సమస్య చాలామందిని వేధిసుంది. కొన్ని ఆహారాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయని నమ్ముతారు. అయితే కొన్ని పదార్థాలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దూరం చేయాల్సిన ఆహారాలలో సలాడ్ ఒకటి. గుమ్మడి గింజలు కూడా తినకూడదని అంటున్నారు. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి నిపుణులుంటున్నారు. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలకు ప్రధార కారణాలు ఇవే:
- టమోటాలు, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు తిన్న కిడ్నీలో రాళ్లు వస్తాయి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు కాకుండా సపోటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పుట్టగొడుగులను తినడానికి ఎక్కువ మంది ఇష్ట పడతారు. అయితే.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని డాక్టర్లు అంటున్నారు. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఉసిరికాయ, దోసకాయ, బెండకాయ, క్యాబేజీతోపాటు వేయించిన చికెన్, సాల్టెడ్ నట్స్ వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాక్లెట్లు ఎక్కువ తిన్న కిడ్నీలో రాళ్లు:
- అంతేకాకుండా.. శీతల పానీయాలను కూడా దూరంగా ఉంటే మంచిది. బర్గర్‌లు, పిజ్జా,శాండ్‌విచ్‌లు వంటి ఫాస్ట్ ఫుడ్‌లు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయని చెబుతున్నారు. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు, చిప్స్ , గింజలు అధికంగా ఉండే ఆహారాలను తినడం, చాక్లెట్లు ఎక్కువ తిన్న కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అందకని ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మాఘమాసం విశిష్ఠత ఏంటి?..నదీ స్నానం ఎందుకు చేయాలి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.