Early Wake Up Tips: ఇలా చేశారంటే ఉదయం తొందరగా లేవవచ్చు

పొద్దున లేచి వ్యాయామం చేయాలనుకునేవారు నైట్ త్వరగా పడుకోవాలి. కానీ.. చాలామంది రాత్రి నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్​టాప్, టీవీలు చూస్తున్నారు. అలా చేయకుండా ఆహారం, నీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచి నిద్ర పట్టి ఉదయం సమయానికి లేస్తారు.

New Update
Early Wake Up Tips: ఇలా చేశారంటే ఉదయం తొందరగా లేవవచ్చు

Early Wake Up Tips: ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్రపోవడం చాలా కష్టం. ఇంత కష్టంలో కూడా ఉదయం త్వరగా లేవాలి, వ్యాయామం చేయాలంటే అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. పొద్దున లేచి వ్యాయామం చేయాలనుకునేవారు అలారం పెట్టుకుని నైట్ త్వరగా పడుకుంటారు. కానీ.. ఉదయం లేచేసరికి పరిస్థితి మారిపోతుంది. ఇంకేముంది నిద్ర సరిపోక అలారం ఆఫ్​ చేసి మరీ నిద్రపోతుంటారు. మారిపోయిన జీవన శైలితోనే ఈ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఈ టిప్స్ ఫాలో అయితే అలారం అవసరం లేకుండానే ఈజీగా నిద్ర లేస్తారు. మరి ఆ విషయాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ హ్యాబిట్ దూరం: రాత్రి నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్​టాప్, టీవీని చాలామంది చూస్తారు. ఎందుకంటే మొబైల్, ల్యాప్​టాప్​ల నుంచి వచ్చే బ్లూలైట్.. మెలటోనిన్ ఉత్పత్తి నిద్రకు భంగం కలిగిస్తుంది.
సమయం ముఖ్యం: మీరు ఉదయాన్నే నిద్ర లేవాలంటే ముందు ఓ టైమ్ టేబుల్ అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఏ టైంకి పడుకోవాలి..ఏ టైంకి ఉదయం నిద్ర లేవాలనుకునే టైమ్ పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి.
తేలికపాటి ఆహారం: రాత్రిపూట తేలికపాటి భోజనం ఎంతో ఉత్తమం. తేలికపాటి భోజనం వల్ల కడుపు తేలికగా ఉండి ఉదయం త్వరగా నిద్రలేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ ఆహారాన్ని తింటే కొన్ని సమస్యలు వస్తాయి.
టీ, కాఫీ దూరం: మీరు హాయిగా నిద్రపోవాలంటే రాత్రిపూట టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. భోజనం చేసిన తర్వాత ఈ అలవాటు ఉంటే మానుకుంటే వేకువజామున త్వరగా లేస్తారు.
నీళ్లు తాగాలి: మార్నింగ్ త్వరగా లేవకపోవడానికి కారణం డీహైడ్రేషన్ అని చెప్పుకోవచ్చు. అందుకని నిద్ర లేచిన వెంటనే కొన్ని నీళ్లు తాగితే మంచిది. నీరు తాగే అలవాటు లేకపోతే మరింత బద్ధకంగా ఉంటుందని గుర్తు ఉంచుకోవాలి.
అలారం వద్దు: ఉదయాన్నే నిద్ర లేవాటానికి అలారం, ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా లేపాల్సిందే. పెట్టుకున్న అలారం మోగగానే దాన్ని ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోతారు. అందుకే ముందు అలారం బంద్ చేసుకోవాలి.
డుమ్మా కొట్టొద్దు: వీకెండ్ వచ్చిందంటే ఆఫీసు లేదని ఉద్యోగస్తులు ఎక్కువసేపు పడుకుంటారు. సెలవుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఒకే టైంకి నిద్రలేవాలి. అదే టైమ్ టేబుల్ ఫాలో చేస్తే అనుకున్న సమయానికి ఖచ్చితంగా నిద్రలేస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తే మీకే ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు