Keep Smiling: చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు.. ఎలాగో తెలుసా?

చిన్న చిరునవ్వును మన ముఖంపై తెచ్చుకుని ప్రేమగా సంభాషిస్తే చాలు, అవతలివారు ఎంత అగ్నిపర్వతంగా మండిపోతున్నా సరే ఇట్టే మంచుకొండలా కరిగిపోతారు. నవ్వుతూ మాట్లాడటం వల్ల వారి తరుపు నుంచి కూడా పాజిటివ్‌ మాటలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

New Update
Keep Smiling: చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు.. ఎలాగో తెలుసా?

keep smiling: ఒక చిన్న చిరువ్వుతో ఎన్నో యుద్ధాలను ఆపొచ్చు..ప్రపంచాన్నే జయించవచ్చు. ఒక్క స్మైల్‌తో ఎంత పెద్ద బండరాయిలాంటి మనసు అయినా మంచులా ఇట్టే కరిగిపోతుంది. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ అంటుంటారు. నవ్వడం వరం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం రోగం అనే నానుడి వింటూ ఉంటాం. నిత్యం మన జీవన ప్రయాణంలో రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. కొందరు నవ్వుతూ ఎదుటివారిని ఆప్యాయంగా పలకరిస్తే, మరొకరు అసూయతో అక్కసు వెల్లగక్కుతుంటారు. ఇంకొందరు అయితే ఎప్పుడూ ముఖంపై కోపాన్ని మోస్తూ తిరుగుతుంటారు. కొందరి కోపానికి రకరకాల టెన్షన్లు కారణమై ఉండొచ్చు. పరిస్థితుల ప్రభావంతో మనపై వారి ప్రకోపాన్ని చూపుతారు.

నవ్వుతూ మాట్లాడటం:

అలాంటి సందర్భాల్లో మనం కాస్త బీపీ పెంచుకున్నామంటే చిన్న యుద్ధమే జరుగుతుంది. అలాంటి సమయంలో ఓర్పుగా వైలెంట్‌ కాకుండా రెండు నిమిషాలు సైలెంట్‌గా ఉండి చిన్న చిరునవ్వును మన ముఖంపై తెచ్చుకుని ప్రేమగా వారితో సంభాషిస్తే చాలు, అవతలివారు ఎంత అగ్నిపర్వతంగా మండిపోతున్నా సరే ఇట్టే మంచుకొండలా కరిగిపోవడం ఖాయం. నవ్వుతూ మాట్లాడటం వల్ల వారి తరుపు నుంచి కూడా పాజిటివ్‌ మాటలు వస్తాయని నిపుణులంటున్నారు. కొన్నిసార్లు మనకు ఏదైనా సహాయం అవసరం పడితే అవతలవారు చేయడానికి మక్కువ చూపరు. అంతేకాకుండా మనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం మాత్రం కోపం పెంచుకోకుండా చిన్న చిరునవ్వుతో మనవైపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సమస్యను సవిరంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చేస్తే సహాయం ఏం ఖర్మ ఆస్తులైనా రాసిచ్చేందుకు సిద్ధపడతారు. నవ్వితే లాభముంది కదా అని ఎలాపడితే అలా నవ్వడం కూడా నష్టం కలిగిస్తుంది.

కష్టాలు చూసి నవ్వకుడదు:

నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చెప్పడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఓ సమయం, సందర్భం ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. ఈ విషయంలో ఆడపిల్లలు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అవసరం ఉంటే చిన్న చిరునవ్వుతో ఎదుటివారిని రిక్వె్స్ట్‌గా అడిగితే మనకు సపోర్ట్‌ చేస్తారు. అంతేకాని చిరాగ్గా అసహ్యించుకుంటే సాయం చేసేవారు కూడా సర్దుకుంటారు. పాత కాలంలో అయితే ఆడపిల్లలను బయటికి పంపడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఎన్నో అనుమానాలు, అపార్థాలు పుట్టుకొచ్చేవి. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది, ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎంత ఎదిగినా గర్వం చూపించకుండా ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడటం ముఖ్యం. అవతలి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు జాలి చూపకపోయినా పర్వాలేదు కానీ వాడి కష్టాలు చూసి నవ్వకుండా ఉంటే చాలు. నవ్వండన్నారని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నవ్వడం వలన నవ్వులపాలౌతారని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి: మహిళల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు