Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా నాసిక్ జిల్లాలోని పాల్ఘర్ - మాలేగావ్‌లలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. పాల్ఘర్‌లో, మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు యోగి. మనల్ని చంపేవారిని పూజించబోమని ఆయన వ్యాఖ్యానించారు. మా వాళ్ళని ఎవరైనా చంపేస్తే మనం కూడా వారికీ తగిన విధంగా చేస్తాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది అని చెప్పిన ఆయన.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కాపాడుకోవడం పాకిస్థాన్‌కు కష్టమని అన్నారు.
Yogi Yogi Adityanath: “మీరు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయండి. మరో 6 నెలల్లో పీఓకే భారత్‌కు చెందినది అని మీరు చూస్తారు. దీనికి ధైర్యం కావాలి. బలం ఉంటేనే ఈ పని చేయవచ్చు. మేం కాంగ్రెస్, మహావికాస్ అఘాడి లాంటి వాళ్లం కాదు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారంటే మేం ఏం చేస్తాం అని ఇంతకు ముందు ఈ ప్రజలు చెప్పేవారు. ఈరోజు పాకిస్తాన్ కూడా మనవైపు వంకరగా చూస్తే, దాని చూపు పోతుంది. భయం లేకుండా, ఆగకుండా, అలసిపోకుండా అభివృద్ధి పయనంలో ముందుకు సాగుతున్న నవ భారతం ఇది. ఈ నవ భారతానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు.” అంటూ యోగి ప్రసంగం సాగింది.
Also Read: ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..
కాంగ్రెస్ పై విమర్శలు..
Yogi Adityanath: వారసత్వ పన్ను విషయంలో కూడా కాంగ్రెస్‌పై యూపీ సీఎం విమర్శలు గుప్పించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి ప్రతిపక్ష పార్టీలో చేరిందన్నారు. వారసత్వపు పన్ను ఔరంగజేబు విధించిన జిజ్యా పన్నును పోలి ఉంటుంది. పాకిస్తాన్ మద్దతుదారులను ఆ దేశానికి వెళ్లి అడుక్కోవాలని నేను కోరుతున్నాను.. ఆ దేశాన్ని పొగిడే వారికి భారతదేశంలో స్థానం లేదు. అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బీజేపీ ఎన్నికల్లో పోరాడుతోంది: యోగి
Yogi Adityanath: నాసిక్ జిల్లా మాలెగావ్ నగరంలో జరిగిన రెండో బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. అధికారం కోసమే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అధికారం అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దేందుకేనని అన్నారు. “నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారనడంలో సందేహం లేదు. ఈసారి 400కు పైగా చేరడంతో కాంగ్రెస్, విపక్షాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయోధ్యలోని తన ఆలయాన్ని ఎవరూ ధ్వంసం చేయలేని విధంగా లార్డ్ రామ్ ప్రతిపక్షం అధికారంలోకి రాకుండా చూస్తాడు.” అని యోగి ధీమా వ్యక్తం చేశారు.