Uttar Pradesh: ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు మరో నెల గడువు‌‌–యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల డిక్లరేషన్ కోసం అనౌన్స్ చేసింది. ఆగస్టు 31లోగా వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు చెప్పింది. అయితే ఈ గడువు దాటినా...ఇప్పటికి చాలా మంది తమ ఆస్తుల వివరాలు సమర్పించకపోవడంతో...దీని గడువును మరో నెలకు పొడిగించింది.

New Update
Yogi: పేదలు, మహిళల జోలికొస్తే మీ పని ఖతమే.. సీఎం సీరియస్ వార్నింగ్!

Asset Declaration: ఉత్తరప్రదేశ్‌లో 2023‌‌–24 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఉద్యోగులు, అధికారులు అందరూ తమ చర, స్థిరాస్తుల వివరాలను అప్ లోడ్ తప్పనిసరిగా చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూల్ పెట్టింది. దానికి సంబంధించి ఆర్డర్‌‌ను కూడా పాస్ చేసింది. ఆగస్టు 31లోపు ఆస్తుల వివరాలను సమర్పించాలని గడువు పెట్టింది. అయితే ఈ తేదీ ముగిసేసరికి రాష్ట్రం మొత్తం లో 74 శాతం మందే తమ చర, స్థిరాస్తుల వివరాలను సమర్పించారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో  ఇంకా 2.44 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఆస్తుల వివరాలను సమర్పించాలి. టెక్స్‌టైల్స్, సైనిక్ కళ్యాణ్ (సైనికుల సంక్షేమం), ఇంధనం, క్రీడలు, వ్యవసాయం, మహిళా సంక్షేమం వంటి కొన్ని శాఖలు ఈ ఆదేశాలను పాటించాయి. అయితే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, పారిశ్రామిక అభివృద్ధి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు మాత్రం తమ వివరాలను ఇప్పటి వరకు ఇవ్వలేదు.

ఉత్తరప్రదేశ్‌లో అవినీతిని నిరోధించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేందుకే ఈ ఆస్తుల వివరాలను కలెక్ట్ చేస్తున్నామని చెబుతోంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. దీనిలో అందరు ఉద్యోగులు తమ వివరాలను కచ్చితంగా సమర్పించాలని చెబుతున్నారు. ఒకవేళ అలా చేయకపోతే జీతాలను ఆపేయడంలాంటి కఠినమైన చర్యలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ సింగ్. కానీ అందరూ ఆస్తుల వివరాలను సమర్పించేవిధంగా చర్యలు తీసుకుంటామని...కఠినమైన చర్యలు మాత్రమే ఉండవని ఆయన స్పష్టం చేశారు.

Also Read: TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు