/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cyclone-1-1-jpg.webp)
Yellow Alert : రెమాల్ తుఫాన్ (Cyclone Remal) పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్... దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాలకు వాతావరణశాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం (Rain) కురవవచ్చునని పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిర్మల్,మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రెమాల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also read: రెమాల్ తుపాన్ ఎఫెక్ట్… 14 విమానాలు రద్దు..ఎక్కడంటే!