Big breaking: ఎన్డీఏకు మద్దతిచ్చిన వైసీపీ.. స్పీకర్ ఎన్నికకు సానుకూల స్పందన!

దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది. జూన్‌ 26న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరగనుంది.

Big breaking: ఎన్డీఏకు మద్దతిచ్చిన వైసీపీ.. స్పీకర్ ఎన్నికకు సానుకూల స్పందన!
New Update

Delhi: దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది. జూన్‌ 26న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరగనుంది.

బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకే..
అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో  బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని జగన్ ఒక్కమాట కూడా  అనని జగన్.. రాష్ట్రంలోనూ కూటమితో పొత్తుపెట్టుకున్నప్పటికీ బీజేపీని సూటిగా టార్గెట్ చేసి కామెంట్స్ చేయలేదు.

దేశ చరిత్రలో మొదటిసారి..
ఇదిలా ఉంటే.. భారత చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుండటం ఆసక్తికరంగా మారింది. మాములుగా స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మోదీ 2.0 పాలనతో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు కొనసాగాయి. కానీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెల్చుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఈ అలా చేయకపోతే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని రాజ్ నాథ్ విపక్షాలను కోరారు. ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనికి ఎన్డీయే సమ్మతించకపోవడంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. 18వ లోక్ సభ స్పీకర్ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా (Om Birla) నామినేషన్‌ వేయగా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ (K Suresh) నామినేషన్ వేశారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక నిర్హహించనున్నారు.

#ycp #nda #loksabh-aspeaker
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe