Sajjala: 'పదేళ్ల తర్వాత కూడా అవే నాటకాలు.. ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీ ఎక్కారు?'

బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ తర్వాత కూటమి పెద్దలపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. పదేళ్ల ముందు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారన్నారు. అప్పుడిచ్చిన హామీలన్ని ఏం అయ్యాయని ప్రశ్నించిన సజ్జల.. మళ్లీ ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీపైకి వచ్చారని విమర్శించారు.

Sajjala: 'పదేళ్ల తర్వాత కూడా అవే నాటకాలు.. ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీ ఎక్కారు?'
New Update

సరిగ్గా పదేళ్ల క్రితం చంద్రబాబు,మోదీ,పవన్ ముగ్గురూ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో తిరుపతి సభలో కలిశారని.. పదేళ్ల తర్వాత కూడా అవే నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదని.. 2014లో అందరూ కలిసినా ఒక శాతం ఓట్ల తేడా మాత్రమే వచ్చిందన్నారు సజ్జల. నిన్నటి సభలో గతంలో ఉన్న ఉత్సాహం కనపడలేదని చురకలంటించారు. 2014లో ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన హామీలన్నీ తర్వాత ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎంతవరకూ అమలుచేశారని సజ్జల నిలదీశారు.

విడాకులు తీసుకున్నారు:

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత విడాకులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. విడిపోయిన తర్వాత బండ బూతులు తిట్టుకున్నారని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో మోదీపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీని పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లు అంటూ కామెంట్ చేశారని గుర్తు చేశారు సజ్జల. అబద్ధాలు,మోసపూరిత హామీలతో 2014 లో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ముగ్గురూ ఓకే స్టేజి పైకి వచ్చారని అడిగారు. అబద్ధాలు, వంచన, బాధ్యతారాహిత్యం, ప్రజలను మోసం చేయడం సులభం అనే లెక్కలేనితనం ఈ మూడు పార్టీల్లో కనిపిస్తుందని మండిపడ్డారు సజ్జల.

ప్రజలు మరిచిపోలేదు:

రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారని అనుకున్నారా అని సజ్జల క్వశ్చన్‌ చేశారు సజ్జల. జగన్ పై దుమ్మెత్తి పోయడం,నోటికొచ్చినట్లు తిట్టడం ఒకటే పనిగా మారిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏం చేస్తారో చెప్పాలి గానీ అది చేయలేదని ఎద్దేవా చేశారు.

Also Read: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇలా అప్లై చేసుకోండి!

#prajagalam #sajjala-ramakrishna-reddy #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe