Raghuramakrishna Raju: వైసీపీ పాలనలో అవినీతి..హైకోర్టులో పిల్ చేసిన ఆ పార్టీ ఎంపీ..!

వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ మొత్తం 1,311 పేజీలతో పిటిషన్ దాఖలు చేశారు.

Raghuramakrishna Raju: వైసీపీ పాలనలో అవినీతి..హైకోర్టులో పిల్ చేసిన ఆ పార్టీ ఎంపీ..!
New Update

YCP Raghuramakrishna Raju filed a PIL in AP High Court on CM jagan:  వైసీపీ పాలనలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తం 1,311 పేజీలతో పిల్ దాఖలు చేశారు. ఇప్పటికే సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ.. తాజాగా, మరో పిటిషన్ వేయడంతో సంచలనంగా మారింది.

Also Read: ఏ2గా చంద్రబాబు.. ఏపీ సీఐడీ మరో కేసు

సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎంపీ రఘురామ. ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్టు సమాచారం. మద్యం, ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో తెలిపారు.

పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. భారతీ సిమెంట్స్ కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ రెడ్ బ్యాగ్ లలో ఇవ్వాలని నిబంధన విధించిన అంశాన్ని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. అన్ని సిమెంట్ కంపెనీలు ఇక్కడే భారతీ పాలిమర్స్ నుంచి రెడ్ బ్యాగ్ లు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్టు వివరించారు. సీఎం, మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. రఘురామ పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు.. ఆ పిల్ కు నెంబరు కేటాయించింది.

#ycp #andhra-pradesh-cm-jagan #mp-raghu-ramakrishna-raju
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe