Andhra Pradesh : మైలవరం వైసీపీలో కొత్త ట్విస్ట్

మైలవరంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ని ఖరారు చేసింది. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న ముద్రబోయిన ఈరోజో రేపో వైసీపీలో జాయిన్ అవనున్నారు.

Andhra Pradesh : మైలవరం వైసీపీలో కొత్త ట్విస్ట్
New Update

Mylavaram YCP Ticket : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మైలవరం(Mylavaram) హాట్ టాపిక్ అవుతోంది. అటు టీడీపీ(TDP), ఇటు వైసీపీ(YCP) రెండు పార్టీల్లో ఇక్కడ టికెట్ కోసం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మైలవరం అభ్యర్ధిగా వైసీపీనే ఉంచి ముద్రబోయిన వెంకటేశ్వర్రావు(Muddaraboina Venkateswara Rao) ను అధిష్టానం ఖరారు చేసింది. నిన్న సీఎం జగన్ కలిసిన ముద్రబోయినకు మైలవరం సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మైలవరం ఇన్చార్జిగా ముద్రబోయినను అధిష్టానం ప్రకటించనుందని తెలుస్తోంది. టిడిపిలో తనకు అన్యాయం జరిగిందని రెండు రోజుల ముందు కార్యకర్తల ముందే కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబోయిన.. వైసీపీ నుండి ఆఫర్ రావడంతో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మైలవరం ఇన్చార్జిగా ఉన్న సర్ణాల తిరుపతిరావు యాదవ్ ఉన్నారు. మరోవైపు ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి రావడంతో .. నూజివీడు ఎమ్మెల్యే ను అధిష్టానం పిలిపించింది.

Also Read : షర్మిలకు బిగ్ షాక్.. నేడు తిరిగి వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే?

వసంత కృష్ణను తప్పించిన వైసీపీ..
అంతకు ముందు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్(CM Jagan) బిగ్ షాక్ ఇచ్చారు. ఆ నియోజకవర్గం ఇంచార్జిగా శ్వర్నాల తిరుపతిరావు(Sarnala Tirupathi Rao) ను ఖరారు చేశారు. మైలవరం జెడ్పీటీసీ(ZPTC) గా ఉన్న తిరుపతిరావును పోటీచేయించాలని భావించింది అధిష్టానం. సామాజిక వర్గాల అనుగుణంగా తిరుపతిరావు అయితే బెటర్ అనుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ నిర్ణయం మార్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైల‌వ‌రం అసెంబ్లీ సీటు విష‌యంలో చాలా స్పీడ్‌గా వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తిరుపతిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినప్పుడే అనేక అనుమానాలు బయటపడ్డాయి. ఇక్కడ వ‌సంత‌ను మార్చాల‌నుకుంటేజజమైలవరంలో మంచి పట్టు ఉన్న , ఇక్కడ నుంచే సీటు అడుగుతున్న జోగి రమేష్‌కు ఇవ్వొచ్చు. పైగా మైల‌వ‌రంలో గౌడ వ‌ర్గం ఓట‌ర్లు చాలా ఎక్కువ‌. జోగికి యాద‌వ క‌మ్యూనిటీ ఎక్కువుగా ఉన్న పెన‌మ‌లూరు ఇచ్చి, గౌడ వ‌ర్గం ఎక్కువుగా ఉన్న మైల‌వ‌రంలో యాద‌వ క‌మ్యూనిటీకి చెందిన తిరుప‌తిరావు యాద‌వ్‌కు సీటు ఇవ్వడం మీద అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే సీటును ముద్రబోయినకు ఎందుకు ఇస్తున్నారో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు జరుగుతాయో అని కామెంట్ చేస్తున్నారు.

Also Read : Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుమ్మనూరు గుడ్‌ బై

#andhra-pradesh #ycp #mylavaram #muddaraboina
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe