పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టింది.. విజయసాయి రెడ్డి ట్వీట్! ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. By V.J Reddy 04 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! ఆయన ట్విట్టర్ వేదికగా.. "అమ్మా పురంధేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?" అంటూ విమర్శించారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవని అన్నారు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిదని.. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే...ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. Also Read: AI వాడకంపై కొత్త రూల్స్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన! "ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?" అంటూ పురంధేశ్వరిపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా పురందేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2023 #ap-politics #bjp-purandeswari #mp-vijayasaireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి