AP TDP News : పార్థసార‌ధికి నూజివీడు టిక్కెట్ ఖ‌రారు..!

పార్థసార‌ధికి నూజివీడు టిక్కెట్ ఖ‌రారు చేసింది టీడీపీ అధిష్టానం. ఫిబ్రవ‌రిలో ఆయన టీడీపీలో చేర‌నున్నారు. 2019లో పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారధి. అటు పెన‌మలూరు టిక్కెట్ బోడెకు ఇవ్వడంపై ఇంకా క్లారిటీ రాలేదు.

New Update
AP TDP News : పార్థసార‌ధికి నూజివీడు టిక్కెట్ ఖ‌రారు..!

Parthasarathi Nuzividu Ticket Confirm : టీడీపీ(TDP) లో చేరేందుకు మరో వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) సిద్ధమయ్యారు. పార్థసారధి(Parthasarathi) పసుపు కుండువా కప్పుకోనున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్థసారధి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2019లో పెనమలూరు(Penamaluru) నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారధి. ఇక రానున్న ఎన్నికలకు నూజివీడు టికెట్‌ ఖరారు చేసింది టీడీపీ(TDP) అధిష్టానం. ఫిబ్రవరి మొదటివారంలో టీడీపీ చేరనునున్నారు పార్థసారధి. వైసీపీ నుంచి మరోసారి పెనమలూరు టికెట్‌ ఆశించారు పార్థసారధి. అయితే పెనమలూరు టికెట్‌ను మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించిన వైసీపీ నిర్ణయం తీసుకుంది.

ఇక్కడ కూడా పెనమలూరు టికెట్‌కు నో:
టికెట్‌ ఇవ్వకపోవడంతో వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు పార్థసారధి. టీడీపీలోనూ పెనమలూరు టికెట్‌ అడిగారు. అయితే మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఉండటంతో పెనమలూరు టికెట్‌ ఇవ్వలేమని టీడీపీ పార్థకు సర్థి చెప్పింది. నూజివీడు(Nuzividu) టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పెనమలూరు టికెట్‌, గెలుపు తనదేనంటున్నారు బోడె ప్రసాద్‌.

గతంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించాయి. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్‌ తనను గుర్తించడం లేదని ఆయన అన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారన్నారు. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని, ఎలాంటి అవమానాలు ఎదురైనా కాపాడుతూ వస్తున్నారన్నారు. దీంతో ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం ఆసమయంలో బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: ఇది ఆటో బైక్! అటు త్రీవీలర్ గా.. ఇటు టూవీలర్ గా భలే ఉంది

WATCH:

Advertisment
తాజా కథనాలు