Pithapuram : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీటు మార్చే దిశగా అధికార పార్టీ వైసీపీ(YCP) ఆలోచన చేస్తోంది. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం(Pithapuram) నుండి పోటీ చేస్తారని ప్రచారంలో ఉండడంతో అధికార పార్టీ అలర్ట్ అవుతోంది. దానికి తోడు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంతృప్తి లేఖ రాశారు. దీని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది వైసీపీ. ముద్రగడ(Mudragada) ను తమ పార్టీలోకి లాక్కుని... పవన్ కళ్యాణ్ పై అతనిని, మరో బలమైన నేతను పోటీలో నిలిపేలా ఎత్తులు వేస్తోంది.
ఎస్వీఎస్ఎస్ వర్మతో చెక్..
ఇదిలా ఉంటే మరోవైపు సీటు పై క్లారిటీ లేక టిడిపి(TDP) మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(Ex. MLA SVSN Varma) కూడా అసంతృప్తితో ఉన్నారు. పవన్ వచ్చినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వర్మ స్ధానిక నేతగా బలంగా ఉండటంతో ఆయన్ని కూడా వైసిపి లోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వర్మ తో మాట్లాడేందుకు జిల్లాకు చెందిన కీలక నేతలను రంగంలోకి దింపింది అధిష్టానం. అయితే వర్మ మాత్రం ఇంకా ఏమీ కన్ఫామ్ చేయలేదు. నాది గెలిచే సీటు.. నన్ను చంద్రబాబు, పవన్ లు వదులుకోరని, అవకాశం కచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నా అంటూ అధికార పార్టీ పెద్దలకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఒకవేళ చంద్రబాబు, పవన్‌లు వర్మను పట్టించుకోకపోతే మాత్రం ఆయన వైసీపీలోకి కచ్చితంగా వెళ్ళిపోతారు.
మూడు ఆయుధాలు..
వర్మ, గీత, ముద్రగడ 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి మూడు పార్టీల నుంచి బరిలో ఉన్న బలమైన నేతలు. అందుకే ముగ్గురి మీదా ఫోకస్ పెట్టింది వైసీపీ. ముగ్గురిని ఒకే పార్టీలో లాగి పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. అందులో బాగంగా రకరకాల ఈక్వేషన్స్‌ను ట్రై చేస్తోంది. ముద్రగడ లేక అతని కొడుకు గిరిని...లేదా వర్మ ను కానీ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఒప్పించాలని వైసీపీ అనుకుంటోంది. అలాగే వంగా గీతను కాకినాడ పార్లమెంటు పరిధిలో మరోక స్ధానంలో పెట్టాలని భావిస్తోంది. మొత్తానికి ముగ్గురు నేతలను కాకినాడ, పిఠాపురం నుంచి తమ ఆయుధాలుగా మాత్రం మలుచుకోవాలని చూస్తోంది.
ఇంకా నిర్ణయం తీసుకోని జనసేనాని..
ఇక పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా....జనసేనాని మాత్రం దాని గురించి ఒక నిర్ణయానికి రాలేదు. పిఠాపురం, అటు గాజువాకలో మరోమారు సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం.
Also Read : BREAKING : రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ!