YCP-TDP: లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు.. వైసీపీని వీడిన పార్టీ శ్రేణులు..!

నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుతో గిద్దలూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నా రాంబాబు స్థానంలో నాగార్జున రెడ్డిని నియమించారు. దీంతో లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దుంటున్నారు వైసీపీ శ్రేణులు. పార్టీని వీడి టీడీపీలోకి వలసలు వెళ్లుతున్నారు.

New Update
YCP-TDP: లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు.. వైసీపీని వీడిన పార్టీ శ్రేణులు..!

Ongole: ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ (CM Jagan) నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేస్తున్న సంగతి తెలస్తోంది. ఈ క్రమంలోనే గిద్దలూరు నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నా రాంబాబు స్థానంలో నాగార్జున రెడ్డినీ (Nagarjuna Reddy) నియమించారు. దీంతో వైసీపీ శ్రేణలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అనే నినాదంతో ఉంటున్న వారు అభ్యర్థిని మార్చడంతో సహించలేకపోతున్నారు. వైసీపీనీ  ఆ పార్టీ శ్రేణులు వీడిపోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: అసెంబ్లీ సమావేశాలు ఇందుకే.. ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్..!

అయితే, ఈ ముసలం ఇప్పుడు టీడీపీ (TDP) ముత్తుముల అశోక్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అభ్యర్థి మార్పు భరించలేని వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి చేరారు. రిసెంట్ గా నిర్వహించిన జయహో బీసీ సభకు కూడా విజయవంతం అయినట్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్ రెడ్డి గెలుపు తధ్యం అని సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: నీ అంతు చూస్తా.. ZPTCని ఫోన్ చేసి బెదిరించిన మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు..!

కాగా, అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా  టీడీపీ, జనసేన పొత్తులు (TDP - Janasena Alliance) పెట్టుకున్నాయి. అందుకు తగ్గటుగానే ప్రజల్లో ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికార పార్టీ వైసీపీ ఏమో వై నాట్ 175 అంటోంది. అందుకు తగ్గట్టే నియోజవకర్గ అభ్యర్ధులను మారుస్తోంది. ఇలా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎవరూ వస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు