Crime News: కడపలో దారుణం.. మైనర్ బాలికపై వైసీపీ నేత లైంగిక వేధింపులు..!

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై వైసీపీ నేత దాదాపీర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత తల్లి ఆరోపించింది. దాదాపీర్ ఇంట్లో తల్లి కూతురు అద్దెకు ఉంటుండుగా.. తను లేని సమయంలో కుమార్తెపై అత్యాచారయత్నం చేశాడని తెలిపింది.

New Update
Crime News: కడపలో దారుణం.. మైనర్ బాలికపై వైసీపీ నేత లైంగిక వేధింపులు..!

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ నేత దాదాపీర్ మైనారిటీ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత తల్లి ఆరోపించింది. దాదాపీర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక మీడియా ముందు గోడు వెళ్ళబోసుకుంది మైనర్ బాలిక తల్లి.

Also Read: గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

దాదాపీర్ ఇంట్లో తల్లి జమీలా, కూతురు అద్దెకు ఉంటున్నారు. ప్రొద్దుటూరు 23 వార్డు వైసీపీ కౌన్సిలర్ తండ్రి వడ్ల దాదాపీర్ మాయ మాటలు చెప్పి తన కుమార్తె(19)ను బలవంతంగా శారీరకంగా అనుభవిస్తున్నట్లు బాధిత తల్లి తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: మంత్రి బొత్స వ్యాఖ్యలకు పురంధేశ్వరి మాస్ కౌంటర్..!

వైసీపీ నేత దాదాపీర్ తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నా వడ్ల దాదాపీర్ చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. చివరకు ఇళ్ళు ఖాళీ చేస్తామన్నా చెయ్యనివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు