Purandeswari : మంత్రి బొత్స వ్యాఖ్యలకు పురంధేశ్వరి మాస్ కౌంటర్..!

దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు..అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందన్నారు.

New Update
AP News: జగన్ ఆ గాయాలపై ఆత్మపరిశీలన చేసుకో.. పురందేశ్వరి సంచలన కామెంట్స్!

Vijayawada : బీజేపీపై మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) మండిపడ్డారు. దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు..అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

Also Read: నెల్లూరులో రచ్చ..రచ్చ…పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..!

బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని.. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారని ప్రశ్నించారు. పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు