Tadipatri : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. తగ్గని ఉద్రిక్తత! తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. By srinivas 15 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి High Tension In AP : తాడిపత్రి(Tadipatri) లో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత సూర్యముని ఇంటిపై వైసీపీ(YCP) నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కేతిరెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. Also Read : కొత్త రకం జొన్న పంటలో పుష్కలంగా ఇథనాల్.. ఇద్దరి నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండటంతో.. ఈ క్రమలో టీడీపీ కార్యకర్తల జేసీ నివాసానికి భారీగా చేరుకోగా.. వైసీపీ శ్రేణులు సైతం కేతిరెడ్డి(Kethireddy) ఇంటికి తరలివెళ్లారు. ఇద్దరి నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండటంతో కార్యకర్తలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. ఈక్రమంలోనే పెద్దారెడ్డిని ఇంటి నుంచి తీసుకెళ్లారు పోలీసులు. అయితే పెద్దారెడ్డి అరెస్ట్‌పై క్లారిటీ ఇవ్వకుండానే ఆయనను తరలించడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో జేసీ, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గరున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో చాలామంది వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లగా.. జేసీ, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోకి కొత్త వ్యక్తులు రాకుండా అన్నివైపులా చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల బృందం రాళ్ల దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన జేసీ.. ఇదిలా ఉంటే.. నిన్న గొడవలతో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) ఆస్పత్రిలో చేరారు. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా.. ఆ ప్రభావంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆసుపత్రి పాలైనట్లు ౠయన వర్గీయులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జేసీకి చికిత్స అందిస్తుండగా.. జేసీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు వెల్లడించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని చూసేందుకు ఎవరూ రావొద్దన్న కోరారు. #ap-ycp #ap-tdp #tadipatri #ketireddy #surya-muni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి