నాకు ఆత్మహత్యే శరణం అంటూ సెల్ఫీ వీడియో! ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది By Bhavana 05 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది. తాజాగా ఆ మహిళ మరో వీడియో విడుదల చేశారు. అందులో ఆమె నాతో నగ్న పూజలు చేయించారు, నా పై దాడులు కూడా చేయించారు, హత్యాయత్నం కూడా చేయించారు, అక్రమంగా కేసులు బనాయించారు.. అయిన కూడా నా మీద ఇంకా ఏవో చేయాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , వన్ టౌన్ సీఐ వెంకట రమణ కావాలని చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో ఆరోపించారు. ఆరోపణలు చేస్తున్న మహిళ కూడా వైసీపీ నేత శోభారాణి కావడంతో పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. నన్ను ఇన్ని చిత్ర హింసలకు గురి చేయడం వల్ల నేను మానసికంగా నరకాన్ని అనుభవిస్తున్నాను. అందుకు నాకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జులై 30న ‘ఏమ్మా అంత తక్కువా..? ఎందుకలా? నా మీద నమ్మకం లేదా..!’ అంటూ ఓ మహిళతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ జరిపిన సంభాషణ వీడియో వైరల్ అయింది. ఆ తరువాత కొద్ది రోజులకే శోభారాణి వీడియో కూడా వైరల్ గా మారింది. సెల్ఫీ వీడియోలో శోభారాణి ఎస్పీని సంభోదిస్తూ... ‘‘నా పేరు శోభ. గతంలో వన్‌టౌన్ ఏరియాలో ఉండేదాన్ని. లెక్చరర్‌గా పని పనిచేశాను. ఫ్యాషన్ డిజైనర్‌ని కూడా. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాను. ఎమ్మెల్యేతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. కావాలనే నా మీద కేసులు పెట్టారు. హోం మినిస్టర్ గారికి దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నిటిని కూడా పంపించాను. అప్పట్లో ఎస్పీ ఫక్కీరప్ప నేను చూసుకుంటాను అని చెప్పారు. నాపై హత్యాయత్నం చేయించారు. దాడులు చేయించారు. రెండురోజుల క్రితం కూడా నాపై కేసు కట్టారు. నా వాట్సాప్‌కు ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు. అయితే ఆ వీడియో అనేది ఏడాది క్రితమే రికార్డు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని గురించి ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా '' నా రాజకీయ ఎదుగుదలను రాజకీయ ప్రత్యర్థులు ఓర్వలేకపోతున్నారు. ఒక మహిళను అడ్డం పెట్టుకొని ఇలాంటి అసభ్యకరమైన వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరైనది కాదు’’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. #kurnool #andhrapradesh #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి