Minister Roja: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..?

మంత్రి రోజాపై నగరిలోని ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు ఫైర్ అవుతున్నారు. రోజాకు టికెట్ ఇస్తే వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని అంటున్నారు. రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమన్నారు.

New Update
Minister Roja: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..?

Nagari YCP Incharge Comments on Roja: తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాపై అసమ్మతి ఇంకా కొనసాగుతుంది. నియోజకవర్గంలో  ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ (Iron Leg) అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కామెంట్స్ చేశారు ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు. అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడెలా వందలకోట్లు సంపాదించారని ప్రశ్నించారు.

Also Read: నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభస

నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా (Roja) లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  రోజా సోదరుల దోపిడికి అడ్డుగా ఉన్నామనే తమనే దూరం పెట్టారని వైసీపీ ఇంఛార్జులు ఆరోపిస్తున్నారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టిపరిస్థితిలోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని..ముఖ్యమంత్రి సీఎం జగన్ (CM Jagan) ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని వేడుకున్నారు. రోజాకు సీటు ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని ఖరకండిగా చెప్పేస్తున్నారు.

Also Read: ఏపీ రాజధాని పై సీఎం జగన్ సంచలన ప్రకటన!

రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు వ్యతిరేకవర్గం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణి (R. K. Selvamani) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో (YCP Party) సంబంధమేంటిని ప్రశ్నించారు. సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని.. అలాంటి వ్యక్తి మాకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమని చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు