YCP: ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!

ఐదో జాబితా విడుదల చేసేందుకు వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

New Update
YCP: ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!

YCP: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది అధికార పార్టీ వైసీపీ. ఇందుల్లో భాగంగానే ఇన్ ఛార్జ్ లను మారుస్తూ వస్తోంది. ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించి చర్చలు జరుపుతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసుధన్ యాదవ్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ రాజీనామా నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లను అధిష్టానం సీఎం క్యాంప్ ఆఫీస్ కి పిలిపించింది.

Also Read: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి

రేపల్లె పార్టీ ఇన్ చార్జిగా మోపిదేవిని తొలగించిన వైసీపీ ఈవూరు గణేష్ ను నియమించినట్లు తెలుస్తోంది. అయితే, తననే రేపల్లె పార్టీ ఇన్ చార్జి గా నియమించాలని మోపిదేవి పట్టుపడుతోన్నట్లు ప్రచారం జరుగుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన వీరందరూ సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై వీరు చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది.

Also Read: రాజ్ కొంపలో కుంపటి పెట్టిన రుద్రాణి.. భర్త కోసం కుమిలిపోతున్న కావ్య..!

అయితే, ఇతరులను కాకుండా తమకే తిరిగి టికెట్ ఇవ్వాలని కోరుతోన్నారు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లోనూ కలిపి 10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేల స్ధానాల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ లిస్ట్ లోనూ మార్పులు చేర్పులు జరుగే అవకాశం కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపులు రావడం చర్చినీయాశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు