Lakshmi Parvathi: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి

ఆడపిల్లనంటూ తెలంగాణలో హడావిడి చేసిన షర్మిలకి ఏపీతో ఏం సంబంధం అని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు.. కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పిన షర్మిల.. అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిందని ప్రశ్నించారు.

New Update
Lakshmi Parvathi: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi: ఆడపిల్లనంటూ తెలంగాణలో హడావిడి చేసిన షర్మిల కి ఏపీ తో ఏం సంబంధం అని ప్రశ్నించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. తన మెట్టినిల్లు తెలంగాణ అంటూ చెప్పిన షర్మిల ఏపీకి ఎందుకు వచ్చారని అడిగారు. షర్మిల రాక వెనుక చంద్రబాబు హస్తం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు.. కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పిన షర్మిల.. అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిందని నిలదీశారు.

Also Read: రాజ్ కొంపలో కుంపటి పెట్టిన రుద్రాణి.. భర్త కోసం కుమిలిపోతున్న కావ్య..!

నేను పోటీ చేయకపోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకునే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఎలా చేస్తారు? అని అన్నారు. షర్మిల వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఒకచోట చేరుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణకు చెప్పే హక్కు లేదని స్పష్టం చేశారు.

Also Read: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్‌ గా.. జగన్‌ విమర్శల బాణాలు!

ఎన్టీ రామారావు నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని చెప్పుకొచ్చారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఇదంతా బాలకృష్ణ చేస్తున్నాడని మండిపడ్డారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన పట్టించుకోని భార్య భువనేశ్వరి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. ఎన్ టీ రామారావుపై హక్కులు భార్యగా నాకు, మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉన్నాయని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు