YS Jagan To Visit Vinukonda: ఈరోజు వినుకొండకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ (Rasheed) కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రషీద్ హత్య అనంతరం నిన్న బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి కి వెళ్లారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ వినుకొండ కి వెళ్లనున్నారు.
రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు..
ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని అన్నారు.
మాజీ సీఎం జగన్ ట్విట్టర్ లో..” రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని (YSRCP) అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య (Vinukonda Murder) ఘటన దీనికి పరాకాష్ట.