YCP Chief Jagan : ఎన్నికల (Elections) ఓటమి తరువాత పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan). ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎంపీలతో జగన్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి తమ ఎంపీల అవసరం ఉందని విజయసాయిరెడ్డి ఇటీవల మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.
నిన్న ఎమ్మెల్సీలతో జగన్..
వైసీపీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. మనం చేసిన మంచి పనులు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని అన్నారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. బీజేపీ, జనసేన (Janasena), టీడీపీ (TDP) హనీమూన్ నడుస్తోందని చురకలు అంటించారు. వారికి మరికొంత సమయం ఇద్దామని పేర్కొన్నారు. ఆ తరువాత ప్రజల తరఫున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు. మండలిలో గట్టిగ పోరాడుదాం అని అన్నారు.
Also Read : హైదరాబాద్‌లో మర్డర్ లైవ్ వీడియో