TDP : మంత్రి బుగ్గన నామినేషన్‌ ను రద్దు చేయాల్సిందే..

ఆర్ధిక మంత్రి బుగ్గన నామినేషన్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుగ్గన నామినేషన్ ను RO తిరస్కరించే వరకు న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను చూపించకుండా మంత్రి బుగ్గన వ్యవస్థలను మ్యానేజ్ చేశాడని ఆరోపిస్తున్నారు.

New Update
TDP : మంత్రి బుగ్గన నామినేషన్‌ ను రద్దు చేయాల్సిందే..

Buggana Rajendranath Reddy : ఆర్ధిక మంత్రి బుగ్గన(Buggana) నామినేషన్‌పై టీడీపీ(TDP) నేతలు మండిపడుతున్నారు. డోన్‌లో బుగ్గన నామినేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్‌లో మంత్రి బుగ్గున ఆస్తుల వివరాలను చూపించలేదని.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ROపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బుగ్గన నామినేషన్‌ను రిజెక్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుగ్గన నామినేషన్ ను RO తిరస్కరించే వరకు న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నేతలు తేల్చిచెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు